AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది..

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని వర్రీ వద్దు. అస్సలు డిప్రెషన్ లోకి వెళ్లొద్దు. సప్లిమెంటరీ రాసుకోవచ్చు. ఒకవేళ అది పోయిందా నో ప్రాబ్లం. నెక్ట్స్ ఇయర్ రాసుకోవచ్చు. అస్సలు చదువు అబ్బడం లేదా..? మీకు ఇష్టంమైన ఫీల్డ్ ఏంటో తెలుసుకుని అందులో పరిపక్వత సాధించండి.. తాజాగా తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ వచ్చింది. ఓ లుక్కేయండి....

Telangana: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది..
Telangana Inter Board
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2025 | 5:28 PM

Share

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలను ఖరారు చేశారు అధికారులు. మే 22 నుంచి మే 29 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని షెడ్యూల్ ఇచ్చారు. ప్రథమ సంవత్సరం ప‌రీక్షలు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు నిర్వహిస్తారు.

ఇంటర్ మొదటి సంవత్సరం టైం టేబుల్….

  • మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
  • మే 23 – ఇంగ్లీష్ పేప‌ర్ -1
  • మే 24 – మ్యాథ్స్ పేప‌ర్ 1ఏ, బోట‌ని పేప‌ర్ -1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -1
  • మే 25 – మ్యాథ్స్ పేప‌ర్ 1బీ, జువాల‌జీ పేప‌ర్ -1, హిస్టరీ పేప‌ర్ -1
  • మే 26 – ఫిజిక్స్ పేప‌ర్ -1, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -1
  • మే 27 – కెమిస్ట్రీ పేప‌ర్ -1, కామ‌ర్స్ పేప‌ర్ -1
  • మే 28 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -1
  • మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, జియోగ్రఫీ పేప‌ర్ -1

ద్వితీయ సంవత్సరం టైం టేబుల్….. 

  • మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -2
  • మే 23 – ఇంగ్లీష్ పేప‌ర్ -2
  • మే 24 – మ్యాథ్స్ పేప‌ర్ 2ఏ, బోట‌ని పేప‌ర్ -2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -2
  • మే 25 – మ్యాథ్స్ పేప‌ర్ 2బీ, జువాల‌జీ పేప‌ర్ -2, హిస్ట‌రీ పేప‌ర్ -2
  • మే 26 – ఫిజిక్స్ పేప‌ర్ -2, ఎకాన‌మిక్స్ పేప‌ర్ -2
  • మే 27 – కెమిస్ట్రీ పేప‌ర్ -2, కామ‌ర్స్ పేప‌ర్ -2
  • మే 28 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్ -2
  • మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, జియోగ్రఫీ పేప‌ర్ -2

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..