Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!

బంగారం ధర పరుగులు పెడుతుంది. కొత్త రికార్డుల‌ను సృష్టిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరింది. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుదగ్గులకు లోనవుతున్న బంగారం ధర.. మ‌రోసారి హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని...

Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2020 | 9:05 AM

బంగారం ధర పరుగులు పెడుతుంది. కొత్త రికార్డుల‌ను సృష్టిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరింది. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుదగ్గులకు లోనవుతున్న బంగారం ధర.. మ‌రోసారి హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. దీంతో ప్రజలు పసిడి కొనాలంటేనే భయపడుతున్నారు. అందులోనూ వ‌చ్చేది శ్రావ‌ణ మాసం కనుక బంగారం రేటు తగ్గుతుందోమోనని.. పసిడి ప్రియులు ఎదురు చూస్తుంటే వారికి షాక్ ఇస్తూ హై రేటుకు చేరుకుంది. తాజాగా ఇవాళ కూడా గోల్డ్ ధ‌ర‌ భారీగా పెరిగింది. అలాగే అంత‌ర్జాతీయంగా మార్కెట్లో ప‌సిడి ధ‌ర పెరుగుద‌ల కూడా దీనికి తోడైంది.

తాజాగా హైద‌రాబాద్ మార్కెట్లో ప‌ది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.470 పెర‌గ‌డంతో.. రూ.51,460కి చేరి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.400 పెరుగుద‌ల‌తో రూ.47,180కు చేరుకుంది. ఇక ప‌సిడి రేటుతో పాటే వెండి ధ‌ర కూడా పెరుగుతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మార్కెట్లో కిలో వెండి ధ‌ర రూ.51,900 చేరుకుంది. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ద‌ర రూ.400 పెరిగి రూ.49,100కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.400 పెర‌గ‌డంతో రూ.47,900గా ఉంది. కాగా ప్ర‌స్తుతం పెరిగిన ఈ రేట్ల‌తో పసిడి ప్రియులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ‌చ్చే శ్రావ‌ణ మాసం క‌నుక గోల్డ్ రేటు  మ‌రింత‌ పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Read More:

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌.. బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్ అంటూ..

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి రామ‌స్వామి మృతి..