షాకింగ్: ఇకపై సెల్ ఫోన్ కొంటే చార్జర్ ఇవ్వరంట..!

మొబైల్ ఫోన్ వినియోగదారులకు షాకివ్వబోతున్నాయి ఫోన్ తయారీ సంస్థలు. ఇప్పటి వరకూ ఫోన్ కొంటే ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్, చార్జర్లు ఫ్రీగా కంపెనీలు అందించేవి. అయితే, వచ్చే ఏడాది నుంచి కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ బాక్సులో ఇకపై ఛార్జర్‌ ఉండవంటున్నాయి.

షాకింగ్: ఇకపై సెల్ ఫోన్ కొంటే చార్జర్ ఇవ్వరంట..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 10, 2020 | 12:29 PM

ఫోన్స్, చార్జర్లు ఫ్రీగా కంపెనీలు అందించేవి. అయితే, వచ్చే ఏడాది నుంచి కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ బాక్సులో ఇకపై ఛార్జర్‌ ఉండవంటున్నాయి. గత కొన్నేళ్లుగా ఇయర్ ఫోన్స్ నిలిపివేసిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు తాజాగా ఫోన్‌ ఛార్జర్లు కూడా మొబైల్‌తో పాటు అందించకూడదని ఇప్పుడు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందడుగు వేసిన ఆపిల్, శాంసంగ్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ఫోన్‌ బాక్సులో ఛార్జర్‌ లేకుండా స్మార్ట్‌ఫోన్లను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇకపై కంపెనీలు ఫోన్లు, ఛార్జర్లను వేర్వేరుగా అమ్మే అవకాశం ఉంది. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే శాంసంగ్‌, యాపిల్‌ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్‌ మోడళ్లలో పవర్‌ ఎడాప్టర్‌, ఇయర్‌పాడ్స్‌ లేకుండా తమ ఉత్పత్తులను విక్రయించాలని యాపిల్‌ నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో విడుదలకానున్న ఐఫోన్‌ 12తో యాపిల్‌ ఛార్జర్‌ను ఉచితంగా అందించదని వార్తలు వస్తున్నాయి. రాబోయే ఐఫోన్లతో పాటు ఛార్జర్లను ఇవ్వడాన్ని నిలిపివేయాలని యాపిల్ భావిస్తున్నట్లు యాపిల్‌ విశ్లేషకుడు మింగ్‌ చి కుయో తెలిపారు. 20W ఫాస్ట్‌ ఛార్జర్‌ను విడిగా విక్రయిస్తుందని ఆయన చెప్పారు. 5W, 18W పవర్‌ ఎడాప్టర్ల ఉత్పత్తిని ఏడాది చివర్లో నిలిపివేయాలనుకుంటుందన్నారు. ఇక మరో సెల్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ కూడా ఇదే అంశాన్ని ఆలోచిస్తున్నట్లు కొరియన్‌ వార్తాసంస్థ ఈటీ న్యూస్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్లతో పాటు ఛార్జర్లు ఇవ్వకూడదని శాంసంగ్‌ నిర్ణయించిందని తెలిపింది. చాలా మంది వినియోగదారుల వద్ద ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్లు ఉండటంతో కంపెనీ ఆదిశగా ఆలోచిస్తున్నదని వెల్లడించింది. ఛార్జర్లు తగ్గించడంతో ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని అటు ఇ-వేస్ట్‌ను తగ్గించినట్లవుతుందని సెల్ ఫోన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి.

యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
విడాకుల రూమార్స్‌పై ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
విడాకుల రూమార్స్‌పై ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్