50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే: చంద్రబాబు

న్యూఢిల్లీ : ఈవీఎంలలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేసి డేటా మార్చే అవకాశం ఉందని  ఆయన అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కపిల్ సిబాల్, అభిషేక్‌ సింఘ్వీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. దేశంలో ఎన్నికల తీరు, ఈవీఎం వివాదం, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణ సహా […]

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే: చంద్రబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 14, 2019 | 6:58 PM

న్యూఢిల్లీ : ఈవీఎంలలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేసి డేటా మార్చే అవకాశం ఉందని  ఆయన అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కపిల్ సిబాల్, అభిషేక్‌ సింఘ్వీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. దేశంలో ఎన్నికల తీరు, ఈవీఎం వివాదం, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరును చంద్రబాబు వివరించారు. ఏపీలో వేలాది మెషీన్లు మొరాయించాయని.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేయలేదన్నారు. అంతలో శాంతిభద్రతల సమస్య సృష్టించారని.. అయినా ముందుకు వచ్చి ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని పేర్కొన్నారు. 50శాతం వీవీ ప్యాట్ లు లెక్కించాల్సిందేనని.. లేనిపక్షంలో సుప్రీం కోర్టుకు వెళతామన్నారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల మంది ఓట్లను తొలగించారని.. ఆ తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారన్నారు. పోలైన వాటి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని.. ఇదెలా సాధ్యమైందో అర్ధం కావడం లేదన్నారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికే ఓటు వేయడానికి ఇబ్బందికి గురయ్యారన్నారు. చివరి ఓటు తెల్లవారుజామున 4 గంటలకు పడిందని.. ఎన్నికల నిర్వహణ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు 7 సెక్లనకు బదులు 3 సెకన్లే ఉన్నాయని.. ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే.. ఈసీ దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కనపెట్టి బ్యాలెట్‌కు వచ్చాయని.. జర్మనీ లాంటి దేశాలు కూడా బ్యాలెట్‌కు వచ్చాయని పేర్కొన్నారు.