రామనామంతో మార్మోగిన భద్రాద్రి

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్త జనసందోహం మధ్య ఆ జగదానంద కారకుడి కల్యాణ ఘట్టం కన్నుల పండువను తలపించింది. అభిజిత్ లగ్నంలో సుముహూర్తాన సీతమ్మ మెడలో రాముల వారు తాళికట్టారు. రాములోరి పెళ్లి వేడుకను కనులారా వీక్షించి భక్తులు తరించిపోయారు. భద్రాద్రి మిథిలా స్టేడియంలో మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రామనామ స్మరణతో మారుమోగింది. ఉదయాన్నే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి నుంచి కల్యాణ […]

రామనామంతో మార్మోగిన భద్రాద్రి
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2019 | 3:29 PM

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్త జనసందోహం మధ్య ఆ జగదానంద కారకుడి కల్యాణ ఘట్టం కన్నుల పండువను తలపించింది. అభిజిత్ లగ్నంలో సుముహూర్తాన సీతమ్మ మెడలో రాముల వారు తాళికట్టారు. రాములోరి పెళ్లి వేడుకను కనులారా వీక్షించి భక్తులు తరించిపోయారు. భద్రాద్రి మిథిలా స్టేడియంలో మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రామనామ స్మరణతో మారుమోగింది. ఉదయాన్నే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి నుంచి కల్యాణ మూర్తులను.. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆ తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రోచ్చరణల మధ్య రామయ్య కల్యాణాన్ని జరిపించారు వేదపండితులు. మిథిలా స్టేడియంలో జరిగిన రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. చలవ పందిళ్ల కింద కూర్చొని భక్తులు ఆ రామయ్య పెళ్లి వేడుకను కనులార్పకుండా తిలకించారు.

సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్