AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాగ్నస్టిక్స్ సెంటర్ గా మారిన ‘ భూత గృహం ‘..

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గత ఏడాది జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘోర ఉదంతం గుర్తుందా ? ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. మహిళలు, పురుషులు, పిల్లలతో సహా తమ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. వీరిలో ఓ వృధ్ధ మహిళ డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మూఢాచారాలను విశ్వసించే ఆ కుటుంబ సభ్యులు కళ్ళకు గంతలు కట్టుకుని, కాళ్లకు తాళ్లు బిగించుకుని […]

డయాగ్నస్టిక్స్ సెంటర్ గా మారిన ' భూత గృహం '..
Pardhasaradhi Peri
|

Updated on: Dec 30, 2019 | 5:12 PM

Share

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గత ఏడాది జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘోర ఉదంతం గుర్తుందా ? ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. మహిళలు, పురుషులు, పిల్లలతో సహా తమ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. వీరిలో ఓ వృధ్ధ మహిళ డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మూఢాచారాలను విశ్వసించే ఆ కుటుంబ సభ్యులు కళ్ళకు గంతలు కట్టుకుని, కాళ్లకు తాళ్లు బిగించుకుని బలవన్మరణం పొందారు. వీరిది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ రిపోర్టు ధృవీకరించింది. వీరి సామూహిక ఆత్మహత్యలతో ఆ ఇంటివైపు రావడానికే స్థానికులు భయపడుతూ వచ్చారు. ఆ వీధి వంక చూడడానికే జంకేవారు. అయితే మూఢాచారాలను నమ్మని మోహన్ సింగ్ అనే ఓ డాక్టర్. ఆ ఇంటిని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ గా మార్చేశాడు.

ఆత్మలు, దెయ్యాలంటే తాను నమ్మబోనని, అందుకే ఈ ఇంటిని ఇలా మార్చేశానని చెబుతున్నాడు. తనవద్దకు వచ్ఛే రోగులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదని ఆయన చెప్పాడు. పైగా ఈ ఇల్లు మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడం తనకెంతో నచ్చిందని ఆయన అన్నాడు. అయితే ఈ డాక్టర్ తాను హేతువాదినని చెబుతున్నా ఆ ఇంటి దగ్గర ఓ హిందూ బాబా ‘ దుష్ట శక్తిని పారదోలేందుకు ‘…. ‘ హవనం ‘ చేస్తూ కనిపించడం విశేషం. .

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు