వంశీ బాటలో మద్దాలి..జగన్ డైరెక్షన్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఏ నాయకుడు ఎప్పుడు జంప్ అవుతాడే అర్థంకాని పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం రాజధాని విషయంలో అధిష్టానం స్టాండ్‌పై టీడీపీ నాయకులు భిన్న వర్గాలుగా విడిపోయారు. కొంతమంది సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..గంటా లాంటి ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే ఆ పార్టీని గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి […]
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఏ నాయకుడు ఎప్పుడు జంప్ అవుతాడే అర్థంకాని పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం రాజధాని విషయంలో అధిష్టానం స్టాండ్‌పై టీడీపీ నాయకులు భిన్న వర్గాలుగా విడిపోయారు. కొంతమంది సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..గంటా లాంటి ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే ఆ పార్టీని గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌తో క్యాంప్ ఆఫీస్‌లో భేటీ అయ్యారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి సీఎంను కలిసిన గిరి..పలు విషయాలను జగన్‌తో చర్చించారు. ఇప్పటికే మద్దాలి గిరి వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జోరందుకున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాథాన్యాత సంతరించుకుంది.
గతంలో వల్లభనేని వంశీ కూడా ఇలాగే సీఎంను కలిసి ఆ తర్వాత టీడీపీతో విభేదించి..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ కూడా వంశీ అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మద్దాలి గిరి కూడా వంశీ మార్గాన్నే అనుసరించబోతున్నాని చెప్పకనే చెప్పారు. సీఎం జగన్ అభివృద్ది బాటలో పయనిస్తునారని..నియోజకవర్గ పనుల కోసమే ఆయనను కలిసినట్టు తెలిపారు. టీడీపీ హయాంలో గుంటూరు అభివృద్దికి నోచుకోలేదని పేర్కొన్నారు. రైతులు రాజధాని విషయంలో అపోహలు వీడాలని..చంద్రబాబు ద్వందవైఖరి అవలంభిస్తున్నారని చెప్పారు. తన ప్రవర్తన పార్టీకి నచ్చని పక్షంలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరాతానన్నారు మద్దాలి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 అభ్యర్థులు గెలపొందారు. ఎమ్మెల్యేల సంఖ్య 17కి తగ్గిపోతే..ఆ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కొల్పోయే అవకాశం ఉంది.