AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతబస్తీలో హిందువులెందుకు తగ్గారు? ఓవైసీకి కిషన్‌రెడ్డి సూటిప్రశ్న

తెలంగాణ నగరాలు సోమవారం కమలం ర్యాలీలతో, సభలతో హోరెత్తాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ ప్రాంగణంతోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో కమలం శ్రేణులు భారీ ప్రదర్శనలతో ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వంటి అంశాలపై ప్రజల్లో క్లారిటీ తెచ్చేందుకు కమలం నేతలు ప్రయత్నించారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ర్యాలీలకు, సభలకు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్‌తో పాటు రాష్ట్రస్థాయి నేతలు పలువురు పాల్గొని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు. సిఏఏ, ఎన్నార్సీలపై అనవసర […]

పాతబస్తీలో హిందువులెందుకు తగ్గారు? ఓవైసీకి కిషన్‌రెడ్డి సూటిప్రశ్న
Rajesh Sharma
|

Updated on: Dec 30, 2019 | 5:58 PM

Share

తెలంగాణ నగరాలు సోమవారం కమలం ర్యాలీలతో, సభలతో హోరెత్తాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ ప్రాంగణంతోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో కమలం శ్రేణులు భారీ ప్రదర్శనలతో ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వంటి అంశాలపై ప్రజల్లో క్లారిటీ తెచ్చేందుకు కమలం నేతలు ప్రయత్నించారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ర్యాలీలకు, సభలకు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్‌తో పాటు రాష్ట్రస్థాయి నేతలు పలువురు పాల్గొని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు. సిఏఏ, ఎన్నార్సీలపై అనవసర అపోహలు వద్దని, కాంగ్రెస్ నేతలు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు కమలం నేతలు పిలుపునిచ్చారు.

భారతీయులను విదేశాలకు పంపే అధికారం ఏ ప్రభుత్వనికి ఉండదని, ఇక్కడ ఉన్న ముస్లిం, సిఖ్, జైన్, క్రిస్టియన్‌లకు ఎలాంటి ఢోకా లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ఉన్న ముస్లిమేతర మైనార్టీలు 30 శాతం నుండి 2 శాతానికి తగ్గారని, అందుకు కారణాన్ని పాక్ ఎప్పటికి చెప్పదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నార్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. పాతబస్తీలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ముస్లింల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం ఈ దేశం ముస్లింలను అక్కున చేర్చుకోవడమేనని ఓవైసీ గుర్తించాలని గుర్తు చేశారు కిషన్ రెడ్డి.

కరీంనగర్‌లో జరిగిన సభలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖా సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఎన్నార్సీని ప్రవేశపెట్టింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని, ఎన్నార్పీని ఇంట్రడ్యూస్ చేసింది కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అని గుర్తు చేశారు. అస్సాంలో డిటెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓపెన్ అయ్యాయని, దీనిపై కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.