పూలింగ్‌లో తీసుకున్న భూములు అదే పేరుతో..!

అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని స్పష్టం చేశారు ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో భూములను మళ్ళీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చి తిరిగి ఇచ్చేయవచ్చన్నారాయన. రాజధాని రైతులకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ అభిమతమని ఆయన క్లారిటీ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. బోస్టన్ గ్రూపు నివేదిక జనవరి మూడవ తేదీన ప్రభుత్వానికి అందుతుందని, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని […]

పూలింగ్‌లో తీసుకున్న భూములు అదే పేరుతో..!

అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని స్పష్టం చేశారు ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో భూములను మళ్ళీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చి తిరిగి ఇచ్చేయవచ్చన్నారాయన. రాజధాని రైతులకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ అభిమతమని ఆయన క్లారిటీ ఇచ్చారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. బోస్టన్ గ్రూపు నివేదిక జనవరి మూడవ తేదీన ప్రభుత్వానికి అందుతుందని, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం మొత్తమ్మీద సమస్థాయిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. బోస్టన్ గ్రూపుపై అవాకులు చెవాకులు పేలుతున్న టీడీపీ నేతలు.. ఆ గ్రూపు సేవలను పలు సందర్భాలలో చంద్రబాబు కూడా వినియోగించుకున్న విషయం గుర్తించాలన్నారు.

రాజధాని ప్రాంత రైతాంగంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వారికి మంచి ప్యాకేజి ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పారు మంత్రి. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతుల పక్షాన మాట్లాడుతున్నా అనడం విచిత్రంగా వుందన్నారు పెద్దిరెడ్డి. 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయాలంటే సాధ్యం కాదని, తగుమాత్రంలో భూమి తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకున్న భూములను అదే పేరుతో తిరిగి రైతులకు ఇచ్చేయొచ్చన్నారు పెద్దిరెడ్డి.

రాయలసీమకు కావాల్సింది రాజధానో, సచివాలయమో కాదని.. సీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు కావాలని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఎవరేమి రప్చర్ చేయాలని చూసినా.. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి జగన్ తగిన నిర్ణయమే తీసుకుంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu