న్యూ ఇయర్ వేడుకలు : మందుబాబులకు మెట్రో గుడ్ న్యూస్..
హైదరాబాద్ మెట్రో అధికారులు న్యూ ఇయర్ సందర్భంగా నిబంధనలను సడలించారు. డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు కొనసాగించే ఏర్పాటు చేశారు. మద్యం సేవించినవారు మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతిచ్చారు. తోటివారికి ఇబ్బంది కలిగించకూడదని, అలాగే ట్రైన్ ఎక్కి, దిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా.. ఓఆర్‌ఆర్‌తో పాటు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లై ఓవర్స్‌ను డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి జనవరి ఒకటవ […]
హైదరాబాద్ మెట్రో అధికారులు న్యూ ఇయర్ సందర్భంగా నిబంధనలను సడలించారు. డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు కొనసాగించే ఏర్పాటు చేశారు. మద్యం సేవించినవారు మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతిచ్చారు. తోటివారికి ఇబ్బంది కలిగించకూడదని, అలాగే ట్రైన్ ఎక్కి, దిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా.. ఓఆర్‌ఆర్‌తో పాటు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లై ఓవర్స్‌ను డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి జనవరి ఒకటవ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు.
ఇక యువతులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. ఆకతాయులు వేడుకలను అడ్డు పెట్టుకోని చెలరేగిపోయే అవకాశం ఉందని..ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే 100కు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు.