ఢిల్లీ : తెలుగు వైద్యుల మిస్సింగ్ మిస్టరీ!
ఢిల్లీలో తెలుగు వైద్యుల అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఈనెల 25న డా. హిమబిందు, డా. దిలీప్ సత్య ఢిల్లీలో అదృశ్యమయ్యారు. దీంతో హిమబిందు భర్త డా. శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్ సత్య చండీగఢ్‌లో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. పుదుచ్ఛేరిలోని జిప్‌మర్ ఇంటర్వ్యూకి వెళ్లిన సత్య తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. హిమబిందు ఉదయం 11.30 సమయంలో భర్తకు ఫోన్ చేసి తాను […]
ఢిల్లీలో తెలుగు వైద్యుల అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఈనెల 25న డా. హిమబిందు, డా. దిలీప్ సత్య ఢిల్లీలో అదృశ్యమయ్యారు. దీంతో హిమబిందు భర్త డా. శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్ సత్య చండీగఢ్‌లో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. పుదుచ్ఛేరిలోని జిప్‌మర్ ఇంటర్వ్యూకి వెళ్లిన సత్య తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. హిమబిందు ఉదయం 11.30 సమయంలో భర్తకు ఫోన్ చేసి తాను దిలీప్ సత్యతో కలిసి చర్చికి వెళ్తున్నామని చెప్పింది. కాసేపట్లోనే ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఎంతవెతికినా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు.
[svt-event date=”30/12/2019,3:45PM” class=”svt-cd-green” ] [/svt-event]