AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దానిమ్మ వీరికి విషంతో సమానం.. తిన్నారో ఈ సమస్యలు ఖాయం..

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఫలం దానిమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. మెరిసే ఎర్రటి గింజలు కేవలం రుచికరమే కాదు.. అంతులేని ఆరోగ్య రహస్యాల గనులు కూడా.. రోజూ ఒక దానిమ్మ పండు తింటే డాక్టరుతో పనే ఉండదని అందరూ అంటుంటారు.. కానీ అది అందరికీ నిజం కాదా..? అసలు దానిమ్మను ఎవరెవరు ముట్టకూడదు? అనేది తెలుసుకుందాం..

దానిమ్మ వీరికి విషంతో సమానం.. తిన్నారో ఈ సమస్యలు ఖాయం..
Pomegranate Benefits And Side Effects
Krishna S
|

Updated on: Feb 08, 2026 | 10:02 PM

Share

ఎర్రటి రంగులో ముత్యాల్లా మెరిసే దానిమ్మ గింజలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు.. అంతులేని ఆరోగ్య రహస్యాల గనులు. విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్ల కలయిక అయిన దానిమ్మను రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే అందరికీ ఇది మేలు చేయదు. అసలు దానిమ్మ ఎవరికి లాభం..? ఎవరికి నష్టం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు..

దానిమ్మలోని పాలీఫెనాల్స్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి. రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్యాస్, వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే దానిమ్మ బెస్ట్ ఆప్షన్. ఐరన్ లోపంతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధం. ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి దీనికి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

చర్మ సౌందర్యం

వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, మచ్చలను దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

వీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి..

దానిమ్మ అందరికీ మంచిది కాకపోవచ్చు. ఈ కింది సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి లేదా డాక్టర్ సలహా తీసుకోవాలి..

తక్కువ రక్తపోటు: దానిమ్మ రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పటికే లో బీపీ ఉన్నవారు దీనిని అధికంగా తీసుకోకూడదు.

మందులు వాడుతున్న వారు: కొన్ని రకాల మందుల ప్రభావాన్ని దానిమ్మ మారుస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స పొందుతున్న వారు జాగ్రత్త వహించాలి.

అలెర్జీ: కొంతమందికి దానిమ్మ తింటే దురద, వాపు, వాంతులు అవుతాయి. అటువంటి వారు వెంటనే మానేయాలి.

మధుమేహం: షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు దానిమ్మను పరిమితంగానే తీసుకోవాలి.

కడుపు సమస్యలు: గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

మితంగా తింటే దానిమ్మ మహా ఔషధం. మీ శరీర తత్వాన్ని బట్టి సరైన మొత్తంలో దానిమ్మను మీ డైట్‌లో చేర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి!