నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని వివిధ రకాల వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు నార్మల్‌గా కూడా నువ్వులు తింటారు.
నువ్వులు
నువ్వులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిని కనీసం రోజుకు గుప్పెడు తిన్నా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
పోషకాలు పుష్కలం
ముఖ్యంగా మగవారు ప్రతి రోజూ తప్పకుండా గుప్పెడు నువ్వులు తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
మగవారు
నువ్వులలో సెలీనియమ్, జింక్ పుష్కలంగా ఉంటుంది. అందువలన మగవారు ప్రతి రోజూ నువ్వులు తినడం వలన ఇది టెస్టోస్టిరాన్ స్థాయులను పెంచుతుందంట.
సెలీనీయం, జింక్
అంతే కాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని మగవారు తింటే ఇది శుక్రకణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్
అలాగే కండరాల బలానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. అందువలన మగవారు నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.
కండరాల బలం
అంతే కాకుండా నువ్వుల్లో కాల్షియం , జింక్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, దృఢత్వానికి సహాయపడతాయి.
ఎముకల దృఢత్వం
అలాగే ప్రతి రోజూ కాకపోయినా, కనీసం వారంలో ఒకటి లేదా రెండు సార్లు నువ్వులు తినడం వలన ఇది రోగనిరోధ శక్తిని పెంచి, శరీరానికి కావల్సిన తక్షిణ శక్తిని అందిస్తుంది.