ఎర్ర ముత్యాలు రోజూ గుప్పెడు తింటే.. తరగని యవ్వనం మీసొంతం
12 May 2026
TV9 Telugu
TV9 Telugu
ఎర్రటి దానిమ్మ గింజల్ని చూస్తే మనసుదోచే కెంపులు గుర్తుకొస్తాయి. దానిమ్మ గింజలే కాదు పూలు, కాయలదీ ప్రత్యేకమైన అందమే. వాస్తవానికి దానిమ్మకు సంబంధించిన వేరు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు, అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే
TV9 Telugu
దానిమ్మలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అది పుష్కలంగా లభిస్తుంది
TV9 Telugu
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. నీళ్ల విరేచనాలు అవుతోంటే.. గ్లాసు దానిమ్మ రసం లేదా ఓ కప్పు గింజలు తీసుకోండి. ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
చర్మం నిగనిగలాడాలని, ముడతలు పడకూడదని కోరుకునేవారికి, వృద్ధాప్యం త్వరగా మీద పడకూడదని భావించేవారికి దానిమ్మ ఓ వరం లాంటిది. వీరు రోజూ దానిమ్మ పండ్ల రసం తాగితే నిత్య యవ్వనం సొంతం అవుతుంది
TV9 Telugu
ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు దానిమ్మ పండ్లలో దండిగా ఉంటాయి. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి
TV9 Telugu
ఇవి చర్మం నిగనిగలాడటానికీ తోడ్పడతాయి. దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పైపొరను (ఎపిడెర్మిస్) బలోపేతం చేస్తుంది. ఫలితంగా ముడతలు పడటమూ తగ్గుతుంది
TV9 Telugu
చర్మం ముడతలు పడేది పైపొరలోనే మరి. ఒక్క చర్మ సౌందర్యం ఇనుమడించేలా చేయటమే కాదు.. వయసుతో పాటు ఇబ్బంది పెట్టే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు తగ్గిస్తాయి