మంచిదని వీటిని అదేపనిగా తింటే.. ఊహించని అనర్ధాలు తిప్పలు పెడతాయ్

12 May 2026

TV9 Telugu

TV9 Telugu

కూర‌గాయ‌ల్లో క్యారెట్లు ఎంతో ప్రత్యేక‌ం. ఎందుకంటే వీటిని ఉడికించాల్సిన ప‌నిలేదు. నేరుగా అలాగే ప‌చ్చిగా తిన‌వ‌చ్చు. రోజూ క్యారెట్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్రయోజ‌నాలు అందుతాయి

TV9 Telugu

ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలకు క్యారెట్లు నెల‌వుగా ఉన్నాయి. క్యారెట్లను రోజుకు ఒకటి చొప్పున తిన్నా చాలు ఎంతో లాభం మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటుంటారు

TV9 Telugu

అయితే అది ఎంత మంచిదైనా అతి పనికిరాదు. క్యారెట్లలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కళ్లు, రోగనిరోధక వ్యవస్థ, శరీరంలోని చాలా అవయవాల ఆరోగ్యానికి విటమిన్‌ ఎ తోడ్పడుతుంది 

TV9 Telugu

కానీ మరీ అతిగా తీసుకుంటే కాలేయ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. మన శరీరం సహజంగానే విటమిన్‌ ఎ నిల్వ చేసుకుంటుంది. అందువల్ల దీన్ని మరింత ఎక్కువగా పోగుపడేలా చేయటం మంచిది కాదు

TV9 Telugu

ఇది మితిమీరితే తలనొప్పి, వికారం, తల తిప్పటం, కాలేయం దెబ్బతినటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. విటమిన్‌ ఎ రూపమైన బీటా-కెరటిన్‌ మాత్రలను పెద్ద మొత్తంలో తీసుకుంటే కాలేయ క్యాన్సర్‌కూ దారితీయొచ్చు

TV9 Telugu

ముఖ్యంగా పొగ తాగేవారికి, పొగ అలవాటుండి మానేసినవారికి, ఆస్‌బెస్టాస్‌ ప్రభావానికి గురయ్యేవారికి దీని ముప్పు ఎక్కువ. అందువల్ల సురక్షితంగా విటమిన్‌ ఎ లభించేలా చూసుకోవటమే ఉత్తమం

TV9 Telugu

ఇందుకు ఆహారమే మార్గం. చేపలు, పాలకూర, క్యారెట్లు, అప్రికాట్లతో ఇది దండిగా లభిస్తుంది. ఆకుపచ్చ, నారింజ, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లు తినటం మంచిది

TV9 Telugu

సాధారణంగా డాక్టర్లు మాత్రల కన్నా ఆహారానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ మాత్రలు వేసుకోవటం తప్పనిసరైతే సిఫారసు చేసిన మోతాదులకు కట్టుబడి ఉండాలి