IND vs USA: అమెరికాపై మారిన బ్యాటింగ్ ఆర్డర్.. సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్..
Team India Captain Suryakumar Yadav: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ తో భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్.. మ్యాచ్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ పై కీలక విషయాలు వెల్లడించాడు.

Gautam Gambhir Advice Against USA: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఆ సమయంలో తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు సూర్య. చివరి వరకు బ్యాటింగ్ చేస్తే మార్పు తీసుకురాగలనని నమ్మకంగా ఉన్నానంటూ భరోసా ఇచ్చుకున్నట్లు తెలిపాడు.
సూర్యరశ్మి లేకపోవడం వల్ల పిచ్ తేమగా ఉందని, ఇది 180-190 పరుగులు చేయగల పిచ్ కాదు. ఇది 140 పరుగుల పిచ్ లాంటిది. ఆ సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన కీలక సలహా కూడా తనను ప్రోత్సహించిందని సూర్యకుమార్ అన్నాడు. దీని గురించి సూర్య మాట్లాడుతూ, “14 ఓవర్ల తర్వాత చివరి వరకు బ్యాటింగ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైనా స్కోరును పెంచవచ్చు” అని సూర్యకుమార్ అన్నాడు.
వాంఖడే స్టేడియంలో ఎక్కువ క్రికెట్ ఆడిన అనుభవం తనకు సహాయపడిందని, బ్యాట్స్‌మన్ చివరి వరకు ఉండాలనే అవగాహనతో ఆడానని అతను చెప్పుకొచ్చాడు.
మరోవైపు, USA కెప్టెన్ మోనాంగ్ పటేల్ మాట్లాడుతూ, “మేం 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే గెలవగలమని మేం భావించాం. కానీ, ఓటమికి కారణం క్యాచ్‌లు మిస్ చేయడంతోపాటు ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరడం” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
