AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో కీలక మలుపు..?

T20 World Cup 2026: భారత్ – పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ విషయంలో ఏర్పడిన వివాదంలో బంగ్లాదేశ్ అనూహ్యంగా జోక్యం చేసుకుంది. దీంతో ఐసీసీ vs పీసీబీగా మారిన ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈరోజు లేదా రేపు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది. అంటే భారత్, పాక్ జరిగేలా కనిపిస్తోంది.

Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో కీలక మలుపు..?
2024లో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్‌లో, రెండు జట్లు న్యూయార్క్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 113 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Venkata Chari
|

Updated on: Feb 08, 2026 | 6:58 PM

Share

ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో ఈ నిర్ణయం ప్రస్తుతం 2026 టీ20 వరల్డ్‌కప్ మొదలయ్యాక మరోసారి ఉత్కంఠభరితంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ కీలక సమావేశం కోసం లాహోర్‌కు వెళ్లాడు. బీసీబీ – పీసీబీ మధ్య జరగనున్న సమావేశానికి ఇద్దరు ఐసీసీ అధికారులు కూడా లాహోర్‌కు వెళ్తున్నారు.

భద్రతా కారణాలు చూపిస్తూ, గ్రూప్ దశ మ్యాచ్‌ల కోసం భారతదేశానికి తమ జాతీయ జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మద్దతుతో) నిరాకరించింది. టోర్నమెంట్ సహా-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు తమ మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ అధికారికంగా ఐసీసీని కోరింది.

అయితే, స్వతంత్ర భద్రతా సమీక్షలో ఎలాంటి ప్రత్యేక ముప్పు లేదని తేలడంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. జనవరి చివర్లో పాల్గొనాల్సిన గడువు మిస్ కావడంతో, ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఈ ద్వైవార్షిక టోర్నమెంట్ నుంచి తప్పించి, గ్రూప్–సీలో స్కాట్లాండ్‌ను చేర్చింది.

పాకిస్థాన్ జోక్యంతో వివాదం..

పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బంగ్లాదేశ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌ను బహిష్కరించాలని జాతీయ జట్టుకు ఆదేశించినట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించిన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తప్పించడం “అన్యాయం”, “రాజకీయ ప్రేరేపిత నిర్ణయం” అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ విమర్శించారు. భద్రతపై అనుమానాలు ఉన్న చోట ఆడమని ఏ క్రికెట్ బోర్డుపై ఒత్తిడి తేవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

బుల్బుల్ – నక్వీ సమావేశం ప్రస్తుత గొడవకు ఫుల్ స్టాప్ పెట్టడమే లక్ష్యంగా జరగనుంది. ఆ తర్వాత ఇరు దేశాల బోర్డులు కలిసి ఐసీసీ అధికారులతో సమావేశమై ఏకాభిప్రాయంతో తమ వాదనను వినిపించనున్నట్లు తెలుస్తోంది.

క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. టోర్నమెంట్‌లో అత్యంత భారీ వాణిజ్య విలువ కలిగిన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, టోర్నమెంట్ ప్రతిష్టకు భంగం కలగకుండా అన్ని పక్షాలను సంతృప్తిపరిచే పరిష్కారం కనుగొనాల్సిన ఒత్తిడి ఐసీసీపై భారీగా ఉంది.

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే ప్రణాళికను కొనసాగిస్తే తీవ్ర శిక్షలు తప్పవని ఐసీసీ ఇప్పటికే పీసీబీని హెచ్చరించింది. భారీ ఆర్థిక జరిమానాలు, పాయింట్ల కోల్పోవడం నుంచి భవిష్యత్తు అంతర్జాతీయ టోర్నమెంట్‌ల ఆతిథ్య హక్కులు కోల్పోవడం వరకు, అవసరమైతే బోర్డు సభ్యత్వాన్ని కూడా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

వైఖరి మార్పుపై ఐసీసీ ఆశలు..

ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా కూడా కొలంబోకు వెళ్లి శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వాను కలిశారు. షమ్మీ సిల్వానే భారత్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాలని పీసీబీ చైర్మన్ నక్వీకి ఈమెయిల్ పంపినట్లు సమాచారం.

‘ఫోర్స్ మేజ్యూర్’ నిబంధనను ఆధారంగా చూపిస్తూ భారత్‌తో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడకపోవడానికి పాకిస్థాన్ ప్రయత్నించడంపై ఐసీసీ ఇప్పటికే వివరణ కోరింది. ప్రభుత్వంపై బాధ్యత నెట్టివేసి పీసీబీ ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిందని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

అయితే, తాజా సమాచారం ప్రకారం పీసీబీ చర్చల కోసం ఐసీసీని సంప్రదించడంతో కొంత ఆశ కనిపిస్తోంది. చివరకు ఆ ‘మార్కీ క్లాష్’ (భారత్ – పాకిస్థాన్ మ్యాచ్) జరుగుతుందని ఒక ఐసీసీ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us