హైదరాబాద్‌ శివారులో అన్నాచెల్లెళ్లు మిస్సింగ్

హైదరాబాద్‌ మిస్సింగ్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా నగర శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌ శివారులో అన్నాచెల్లెళ్లు మిస్సింగ్
Ram Naramaneni

|

Oct 30, 2020 | 9:06 PM

హైదరాబాద్‌ మిస్సింగ్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా నగర శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూరుకు చెందిన యాడపల్లి ఆనంద్‌కుమార్, సౌమ్య  దంపతులు. వీరికి కుమారుడు శ్రీపాల్‌ (13), కుమార్తె ప్రేమ(11) ఉన్నారు. గురువారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే వారు పడక గదిలో నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పేరెంట్స్ నిద్రలేచి చూసే సరికి పిల్లలు బెడ్‌రూంలో లేరు. ఆందోళనతో పరిసర ప్రాంతాలలో వెతికిన తల్లిదండ్రులు… సమీప బంధువుల వద్ద వాకబు చేసినప్పటికీ చిన్నారుల ఆచూకీ లభించలేదు. దీంతో  పోలీసులను ఆశ్రయించారు. వారి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

Breaking : టర్కీలో భారీ భూకంపం, అల్లకల్లోలం !

ఇంట్లో వాస్తు దోషం..బయట ప్రభుత్వం వేసిన రోడ్డు ధ్వంసం !

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu