ఇంట్లో వాస్తు దోషం..బయట ప్రభుత్వం వేసిన రోడ్డు ధ్వంసం !

నేను నాయకుడ్ని...ఏది చెబితే అది జరగాలి అన్నట్లు ఉంది విశాఖ జిల్లాలోని ఓ నాయకుడి వ్యవహారం. ఆనందపురం మండలంలోని భీమన్నదొరపాలెం గ్రామంలో...

ఇంట్లో వాస్తు దోషం..బయట ప్రభుత్వం వేసిన రోడ్డు ధ్వంసం !
Follow us

|

Updated on: Oct 30, 2020 | 5:45 PM

నేను నాయకుడ్ని…ఏది చెబితే అది జరగాలి అన్నట్లు ఉంది విశాఖ జిల్లాలోని ఓ నాయకుడి వ్యవహారం. ఆనందపురం మండలంలోని భీమన్నదొరపాలెం గ్రామంలో గవర్నమెంట్ నిర్మించిన సిమెంట్‌ రోడ్డును ఇంటి వాస్తు బాగోలేదని లోకల్ లీడర్ ఒకరు తొలగించడం కలకలం రేపింది. 2017-18 ఫైనాన్సియల్ ఇయర్‌లో సుమారు రూ.5లక్షల నిధులతో 152 మీటర్ల మేర సిమెంట్‌ రోడ్డును గవర్నమెంట్ నిర్మించింది. దానిని ఇప్పుడు పూర్తిగా ధ్వంసం చేయడంతో.. పొలం పనుల కోసం అటుగా రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ‘ఇది ప్రభుత్వం వేసిన రోడ్డయినా మా జిరాయితీ భూమిలో వేయడంతో తొలగించాం’ అని ఆ లీడర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రోడ్డును తొలగించినట్లు ఎటువంటి కంప్లైంట్ అందలేదని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందిస్తామని రామవరం సచివాలయ కార్యదర్శి సత్యప్రసాద్‌ తెలిపారు.

ఇంట్లో వాస్తు దోషం బయట రోడ్డు ధ్వంసం!

Also Read :

జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం

మరో చారిత్రక యోధుడి పాత్రలో బాలయ్య !