మరో చారిత్రక యోధుడి పాత్రలో బాలయ్య !
నందమూరి నటసింహం బాలకృష్ణ మరో చారిత్రక యోధుడి కథలో నటించాలని ఆశపడుతున్నారట. పౌరాణికాలు, చారిత్రాత్మకమైన విషయాలపై మంచి పట్టున్న బాలయ్యను...

నందమూరి నటసింహం బాలకృష్ణ మరో చారిత్రక యోధుడి కథలో నటించాలని ఆశపడుతున్నారట. పౌరాణికాలు, చారిత్రాత్మకమైన విషయాలపై మంచి పట్టున్న బాలయ్యను కాకతీయుల కాలంనాటి గోన గన్నారెడ్డి పాత్ర విపరీతంగా ఆకర్షించిందట. గన్నారెడ్డికి సంబంధించిన పూర్తి విషయాలు, విశేషాలు, వివరాలను చరిత్ర పుటలలో నుంచి వెలికి తీయడం కోసం రచయితలు, కొంతమంది పరిశోధకులను కూడా ఏర్పాటు చేసుకున్నారట బాలయ్య.
ఇప్పటికే అలనాటి తెలుగు పాలకుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో నటించి మెప్పించారు నటసింహం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ 29న తిరిగి షూటింగ్ పున: ప్రారంభమైంది.
Also Read :