20 March 2025
27 ఏళ్ల వయసులోనే రూ.వెయ్యి కోట్లకు వారసురాలు ఈ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుని నటిగా ప్రశంసలు సొంతం చేసుకుంది.
వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించింది.
ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే బ్యూటీ కూడా తనే.
27 ఏళ్ల వయసులోనే పాన్ ఇండియా హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె ఆస్తులు రూ.1000 కోట్లకు పైగానే ఉన్నాయట.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ దంపతుల ముద్దుల కుమార్తె జాన్వీ.
ధడక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది.
ఇటీవలే దేవర సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం దేవర 2, ఆర్సీ 16 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ వయ్యారి.
జాన్వీకి తండ్రి ఆస్తులే కాకుండా సొంతంగా సంపాదించిన ఆస్తులు అధికంగానే ఉన్నాయట. జాన్వీకి ముంబైలో ఖరీదైన ఇళ్లు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్