రీఎంట్రీపై సమీరా రెడ్డి క్లారిటీ !

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి అస్సలు ఆలోచించడం లేదని ప్రముఖ నటి సమీరా రెడ్డి స్పష్టం చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది. 

రీఎంట్రీపై సమీరా రెడ్డి క్లారిటీ !
Ram Naramaneni

|

Oct 30, 2020 | 4:24 PM

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి అస్సలు ఆలోచించడం లేదని ప్రముఖ నటి సమీరా రెడ్డి స్పష్టం చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది.  ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్​ను ఆస్వాదిస్తున్నానని, సినీ ప్రపంచంలోకి మళ్లీ రావడం కష్టమని వెల్లడించింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ అగ్ర హీరోల పక్కన నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించింది సమీరా రెడ్డి. పెళ్లి అనంతరం సినిమా పరిశ్రమకు దూరమైన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా గడుపుతోంది. తరచూ తన చిన్నారులతో కలిసి సరదా వీడియోలు చిత్రీకరించి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

అయితే ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ఓ తమిళ‌ చిత్రంలో సమీరా రెడ్డి నటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, తాజాగా సదరు వార్తలపై నటి స్పందించింది. అవన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది.  ‘మైనే దిల్‌ తుజ్కో దియా’ అనే బాలీవుడ్‌ సినిమాతో సమీరారెడ్డి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నరసింహుడు’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె..  ‘జై చిరంజీవా’, ‘అశోక్‌’ చిత్రాల్లో కథానాయికగా నటించింది.

Also Read :

ఇండియాలో పబ్జీ ఖతం..నేటి నుంచి వారికి కూడా నో ఛాన్స్

Kajal Marriage : వైరల్ అవుతోన్న కాజల్ తీన్మార్ డ్యాన్స్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu