పునర్నవి ఎంగేజ్‌మెంట్ సీక్రెట్ ఇదే.. అభిమానులకు బిగ్ షాక్..
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఇటీవల ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. 'ఎట్టికేలకు ఇది జరుగుతోంది' అని పేర్కొంది.

Punarnavi’s web series: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఇటీవల ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘ఎట్టికేలకు ఇది జరుగుతోంది’ అని పేర్కొంది. దీనితో చాలామంది ఆమెకు నిజంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందా.? అని అనుకున్నారు. అయితే తాజాగా పున్నూ కొత్తగా ఓ పోస్ట్ చేసింది. ఇదంతా తాను చేస్తోన్న వెబ్ సిరీస్ ప్రచారంలో భాగమేనని ప్రకటించింది. ఉద్భవ్ రఘునందన్, పునర్నవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు పవన్ సాధినేని ‘కమిట్‌మెంటల్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. వచ్చే నెల 13వ తేదీ నుంచి ఈ సిరీస్ ‘ఆహా’ వేదికగా ప్రసారం కానుంది. దీని కోసమే పునర్నవి అభిమానులను గత కొద్దిరోజులుగా టీజ్ చేస్తూ వచ్చింది.