అప్పుడు ఇద్దరు కొడుకులతో.. ఇప్పుడు తండ్రితో.. ముద్దుగుమ్మ రొమాన్స్
Phani CH
20 March 2025
Credit: Instagram
ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా మంది స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నటించి థియేటర్లలో రచ్చ చేసింది.
కాకపోతే ఈ ముద్దుగుమ్మ పెద్దగా ప్రయారిటీ లేని రోల్స్ ఆమెకి పడ్డాయి. స్టార్ హీరోలతో సినిమాలంటే సాధారణంగా అలానే ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు రూట్ మార్చింది. కంటెంట్ ఉన్న సినిమాలు, బలమైన పాత్రలే చేయాలని ఫిక్స్ అయ్యిందట.
అందులో భాగంగానే కోలీవుడ్‌లో నటిస్తున్న విజయ్ `జన నాయగన్`, సూర్య `రెట్రో` చిత్రాలు కూడా అలాంటివే అని తెలుస్తుంది.
ఇంతకీ ఇద్దరు కొడుకులతో.. ఇప్పుడు తండ్రితో.. రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు బుట్టబొమ్మ పూజ హెగ్డే.
`రంగస్థలం`లో జిగేల్ రాణి అంటూ థియేటర్లని ఊపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని మించి `కూలీ`లో మన్మథుడు నాగార్జునతో ఐటెమ్ సాంగ్ ఉంటుందట.
అంతక ముందు నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేయగా.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం లో నటించగా ఇప్పుడు తండ్రి నాగార్జునతో పాటలో రొమాన్స్ చేయబోతుంది.