మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు.. పాత తరం నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరికి గుర్తుండే పేరు సావిత్రి.
మహానటి సావిత్రి నాటకాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నటన పై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేసింది.
అయితే 1949 లో ఓ సినిమాలో నటించేందుకు ఛాన్స్ రాగా చిన్న పిల్లగా ఉందని ఆ సినిమా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత `సంసారం` అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.
అయితే ఆ సినిమా సావిత్రికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అదే సమయంలో `పాతాళ భైరవి` సినిమాలో ఒక పాటకు డాన్స్ చేసే అవకాశం లభించింది.
పాతాళ భైరవి సినిమాలో డాన్స్ చేసే అవకాశం కోసం సరదాగా ఆడిషన్‌కి వెళ్లి ఆఫర్ కొట్టింది. ఈ సినిమాకు కెవి రెడ్డి దర్శకత్వం వహించగా నర్తకిగా నటించింది సావిత్రి.
అప్పట్లో నర్తకి అంటే ఇప్పుడు ఐటెమ్ గర్ల్ అని చెప్పొచ్చు. అలా `పాతాళభైరవి`లో ఆమె నర్తకిగా డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా 1951లో విడుదలై సంచలన విజయం సాధించింది. `రానంటే రానే` పాటలో డాన్స్ చేసిన సావిత్రికి మంచి పేరు వచ్చింది. దీంతో సావిత్రి జాతకం మారిపోయింది.