ప్రస్తుతం రామ్ చరణ్‌కు టైమ్ కలిసి రావడంలేదనే చెప్పాలి.. RRR తరువాత వరుసగా ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు చెర్రీ.
RRR సమయంలో చిరంజీవి తో పాటు ఆచార్య సినిమా చేయగా అతి పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కొంటున్నాడు చెర్రీ..
ఈ డిజాస్టర్ దెబ్బతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో RC16 చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రూరల్ బ్యాగ్రౌండ్ స్టోరీతో రూపొందతున్న ఈ సినిమా.
టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపిస్తారట. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుండి అనేక రకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ఈమూవీలో రామ్ చరణ్ తో పాటు స్టార్ క్రియెటర్ థోని కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట.
రామ్ చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తుండగా.. థోని రామ్ చరణ్ కు ట్రైయినర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిలో నిజం ఎంతవుంది అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు.