మీ చర్మానికి సబ్బు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేకుంటే నష్టపోతారు..!
సబ్బు కాలానికి నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. గడువు ముగిసిన సబ్బును వాడటం వల్ల చర్మ సమస్యలు రావచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సబ్బును సరిగా నిల్వ చేసుకోవడం, కొత్తదానిని మాత్రమే వాడటం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు గడువు ముగిసిన సబ్బు వాడితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

మీ సబ్బు బార్‌లో బూజు కనిపిస్తే వెంటనే మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తినదగిన ఉత్పత్తులకు మాత్రమే కాకుండా మీ శరీరంపై వాడే సబ్బుల వంటి ఉత్పత్తులపై కూడా లేబుల్‌లు చదవడం చాలా ముఖ్యం. సబ్బుకు గడువు ముగిసిన తర్వాత అది ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.
సబ్బు కాలంతో పాటు పాడైపోదు కానీ దాని ప్రభావం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. కొత్త సబ్బులతో పోల్చితే సబ్బులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తక్కువగా ఉండొచ్చు. దీనికి కారణం సమయంతో కూడిన రసాయన మార్పులు జరుగడం దీంతో సబ్బు ప్రభావం తగ్గిపోవడం.
గడువు ముగిసిన సబ్బు వాడటం వల్ల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సబ్బు దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కోల్పోతుంది. pH స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల చర్మం చికాకు, పొడిబారడం, అలెర్జీ ప్రతిచర్యలు కలుగుతాయి. ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది.
గడువు ముగిసిన సబ్బులు కొంత కాలం తర్వాత బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరగడానికి అవకాశం కల్పిస్తాయి. దీని వలన చర్మం మీద ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. నిపుణులు గడువు ముగిసిన ఉత్పత్తులను వీలైనంత త్వరగా వాడకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు.
సబ్బును సరిగా నిల్వ చేస్తే గడువు ముగిసినా కూడా దాని ప్రభావం కొనసాగవచ్చు. అయితే కాలక్రమేణా సబ్బు వాసన తగ్గిపోవడం, రంగు మారడం జరుగుతాయి. తక్కువ తేమతో కూడిన ప్రదేశంలో సబ్బును ఉంచడం ద్వారా దాని జీవితం పెరుగుతుంది.
సబ్బు బార్ రంగు మసకబారడం, వాసన తగ్గడం వంటి సంకేతాల కోసం చూసి గడువు ముగిసిందో లేదో తెలుసుకోవచ్చు. సబ్బులో బూజు వస్తే దానిని వెంటనే విసిరేయాలి. పాత సబ్బులు చర్మ సమస్యలను కలిగించే అవకాశం ఉండే కారణంగా వాటిని వాడటం నివారించాలి.
అనేక చర్మ సమస్యలు, అలెర్జీలు ఉండే వారికి గడువు ముగిసిన ఉత్పత్తులను వాడడం హానికరం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సువాసనలేని, తేలికపాటి సబ్బులను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.