Video: 16 ఫోర్లు, 10 సిక్సర్లు.. సెంచరీతో పరాగ్ ఊచకోత.. ఐపీఎల్‌కి ముందే ఇదెక్కడి అరాచకం
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ ర్యాన్ పరాగ్ IPL 2025 తొలి మ్యాచ్‌కు ముందు అజేయంగా 144 పరుగులు చేశాడు. అతను కేవలం 64 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇచ్చిన పరాగ్‌ను టీమ్ ఇండియాలోనూ చేర్చారు.

Riyan Parag: ఈ సంవత్సరం ఐపీఎల్ (ఐపీఎల్ 2025)లో, మాజీ ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ మార్చి 23న బలమైన బ్యాటింగ్ బలాన్ని కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రతి మ్యాచ్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించగల బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవాలంటే, రాజస్థాన్ జట్టులోనూ అలాంటి బ్యాట్స్‌మెన్స్ ఉండాలి. దీనికి నిదర్శనంగా, టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌కు ముందు, జట్టు తుఫాన్ బ్యాట్స్‌మన్ రియాన్ పరాగ్ కేవలం 64 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 144 పరుగులు చేశాడు. అంటే రియాన్ కేవలం సిక్సర్లు, ఫోర్లతో 104 పరుగులు చేశాడు.
గత ఎడిషన్‌లో పరాగ్ ప్రదర్శన..
గత ఐపీఎల్ సీజన్‌లో ర్యాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా అతనికి టీం ఇండియాలో కూడా అవకాశం లభించింది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ IPL 2024లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో 52 కంటే ఎక్కువ సగటుతో 573 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 150 దగ్గర ఉంది. ఈ సీజన్ మొత్తంలో 4 అర్ధ సెంచరీలు చేసిన పరాగ్, 4 వికెట్లు కూడా పడగొట్టాడు. గాయం కారణంగా అతను ఇటీవల టీం ఇండియాకు దూరమయ్యాడు. కానీ, ఇప్పుడు పూర్తిగా కోలుకున్న పరాగ్ ఐపీఎల్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
144* (64) – What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE
— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025
రియాన్ పరాగ్ ప్రతిభను చూసిన రాజస్థాన్ రాయల్స్ అతడిని 14 కోట్ల రూపాయలకు జట్టులో నిలుపుకుంది. వీరితో పాటు, రాజస్థాన్ వేలానికి ముందు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, సందీప్ శర్మలను జట్టులో నిలుపుకుంది.
రియాన్ పై రాజస్థాన్ ఆశలు..
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ ట్రంప్ కార్డ్ కావొచ్చు. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కాకుండా, రియాన్ పరాగ్ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకరు. అలాగే, అతను సొంతంగా మ్యాచ్ గెలవగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అయితే, నితీష్ రాణా కూడా జట్టులో ఉండటంతో, రియాన్ పరాగ్ ఎక్కడ ఆడతారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..