బీజేపీ అభ్యర్థి సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవం
నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి జాఫర్ ఆలమ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులు ఎవరూ పోటీగా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

యూపీ బీజేపీ అభ్యర్థి సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి జాఫర్ ఆలమ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులు ఎవరూ పోటీగా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. సమాజ్‌వాదీ అభ్యర్థి అమర్‌సింగ్ మరణించడంతో ఈ సీటు ఖాళీ అయ్యింది.
కాగా, జూలై 4, 2022 వరకూ జాఫర్ ఆలమ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగనున్నారు. అయితే, బీజేపీ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా గోవింద్ శుక్లా, మహేశ్చంద్ర శర్మ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే, వీరికి పది మంది ఎమ్మెల్యేల మద్దతు లభించకపోవడంతో వీరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికవ్వడం పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ శుభాకాంక్షలు తెలిపారు.