Covaxin Price: కొవాగ్జిన్‌ ధరలపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన.. దీర్ఘకాలం రూ. 150కు కేంద్రానికి విక్రయించలేమని స్పష్టం!

కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత స్వదేశీ టీకా కొవాగ్జిన్‌ ‌ ధరలపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. టీకా ధరలు తగ్గించడం సాధ్యపడదని వివరణ ఇచ్చింది.

Covaxin Price: కొవాగ్జిన్‌ ధరలపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన.. దీర్ఘకాలం రూ. 150కు కేంద్రానికి విక్రయించలేమని స్పష్టం!
Covaxin
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 15, 2021 | 3:35 PM

Bharat Biotech Defends Covaxin high Price: కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత స్వదేశీ టీకా కొవాగ్జిన్‌ ‌ ధరలపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. టీకా ధరలు తగ్గించడం సాధ్యపడదని వివరణ ఇచ్చింది. కేంద్రానికి డోసుకు కేవలం రూ.150కే విక్రయిస్తున్నామని, ఇలా దీర్ఘకాలం తక్కువ ధరకు విక్రయించడం సాధ్యపడదని తెలిపింది. ప్రైవేట్‌ సంస్థలకు 10 శాతం లోపే టీకాలను విక్రయిస్తునట్టు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

టీకా ధరలను తగ్గించాలని వ్యాక్సిన్‌ కంపెనీలతో మరోసారి చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించిన మరుసటి రోజే భారత్‌ బయోటెక్‌ ఈవిధంగా స్పందించింది. రవాణా ఖర్చులు పెరిగిపోయాయని, లాభాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇలా దీర్ఘకాలం బిజినెస్‌ చేయడం సాధ్యం కాదని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ ప్రైవేట్ మార్కెట్లో కొవాగ్జిన్ మోతాదుకు 1,200 రూపాయలకు విక్రయిస్తోంది. అన్ని సామాగ్రిలతో కలిపి కొవాగ్జిన్ సగటు ధర మోతాదుకు 250 రూపాయల కన్నా ఎక్కువే అవుతుందని భారత్ బయోటెక్ తెలిపింది.

ఇదిలావుంటే, కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో)కు ఈ డేటాను మొదట సమర్పిస్తామని, ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్‌కు అందిస్తామని వెల్లడించింది. మూడో దశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్ బయోటెక్ తెలిపింది.

మరోవైపు భారత్‌లోకరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రతకు కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైందని భారత్ బయోటెక్ పేర్కొంది. డెల్టాతోపాటు బీటా వేరియంట్ నూ కొవాగ్జిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఈ అధ్యయనం తేల్చిందని వెల్లడించింది.

Read Also….  ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ నోటిఫికేషన్ .. అర్హులు ఎవరంటే

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే