BENGAL VIOLENCE: బెంగాల్ హింసపై సుప్రీంకు విద్యావేత్తల లేఖ.. మమత మెడకు బిగుస్తున్న ఉచ్చు
ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల అనంతర హింస అంశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చుట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైనా.. బీజేపీకి ఓటు వేసిన వారిపైనా తృణమూల్...
BENGAL VIOLENCE ISSUE BEFORE SUPREME COURT: ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల అనంతర హింస అంశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (MAMATA BANERJEE)కి చుట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైనా.. బీజేపీ (BJP)కి ఓటు వేసిన వారిపైనా తృణమూల్ (TRINAMOOL) మూకలను మమతా బెనర్జీ ఉసిగొలిపారని పలువురు విద్యావేత్తలు సుప్రీంకోర్టు (SUPREME COURT)కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో బెంగాల్ (BENGAL) హింసపై విచారణ జరిపించాలని వారు తమ లేఖలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CHIEF JUSTICE NV RAMANA)కు విఙ్ఞప్తి చేశారు. 600 మంది విద్యావేత్తలు ఈ లేఖలో సంతకాలు చేశారు.
బెంగాల్‌లో పలు యూనివర్సిటీ (BENGAL UNIVERSITY)ల వైస్-ఛాన్సలర్లు (VICE CHANCELLERS), ప్రొఫెసర్లు (PROFESSORS) 600 మంది ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఎన్నికల అనంతరం బెంగాల్ వ్యాప్తంగా జరిగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ (SIT)తో దర్యాప్తు జరిపించాలని, ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని వారు తమ లేఖలో కోరారు. తృణమూల్ కాంగ్రెస్ (TRINAMOOL CONGRESS)కు వ్యతిరేకంగా పని చేసిన వారికి.. ఆ పార్టీకి కాకుండా వేరే పార్టీలకు ఓటు వేసిన వారి ప్రాణాలకు ప్రస్తుతం బెంగాల్‌లో రక్షణ లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీ (TMC) గూండాలకు భయపడి వేలాది మంది పొరుగునే వున్న అస్సాం (ASSAM), ఒడిశా (ODISHA), ఝార్ఖండ్ (JHARKHAND) రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందని విద్యావేత్తలు తమ లేఖలో పేర్కొన్నారు.
జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలోను బెంగాల్ హింసా ఘటనలపై దర్యాప్తు జరగాల్సి వుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. స్వతంత్ర సంస్థల ద్వారా దర్యాప్తు జరిగితే బెంగాల్ ప్రస్తుత వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని వారంటున్నారు. తమ లేఖపై సుప్రీంకోర్టు స్యూమోటోగా స్పందించాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని కించపరుస్తున్నట్లుగా ప్రస్తుతం బెంగాల్‌లో పరిపాలన కొనసాగుతోందని విద్యావేత్తలు తమ లేఖలో పేర్కొన్నారు. మే 2 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల వ్యవధిలో బెంగాల్‌లో 37 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అధికార టీఎంసీ వర్గాలు మట్టుబెట్టాయని కమలం పార్టీ ఆరోపించింది.
గత అయిదేళ్ళుగా మొత్తం 166 మంది బీజేపీ వర్కర్ల (BJP WORKERS)ను టీఎంసీ గూండాలు హత్య చేశాయని బెంగాల్ బీజేపీ (BENGAL BJP) అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (DILIP GHOSH) ఆరోపిస్తున్నారు. తాజాగా పోస్ట్ పోల్ వయలెన్సులో 37 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలను చంపేశారని ఆయనంటున్నారు. హత్యాకాండను కొనసాగిస్తూనే బీజేపీ నేతలపై మమత ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెడుతోందని, గత అయిదేళ్ళలో తమ పార్టీ వర్గాలపై ఏకంగా 30 వేల కేసులను దీదీ ప్రభుత్వం పెట్టిందని ఆయన వివరించారు. ఈ ఆరోపణను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఈనేపథ్యంలో బెంగాల్ హింసపై ఏకంగా ఆరువందల మంది విద్యావేత్తలు సుప్రీంకోర్టుకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.