Gujarat: విషాదం.. తాగునీరు కలుషితం.. నలుగురు మృతి.. 72 మంది ఆసుపత్రి పాలు..
Contaminated drinking water: కలుషితమైన తాగునీరు తాగి నలుగురు మృతి చెందగా.. 72 మంది ఆసుపత్రి పాలయ్యారు. పలువురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన గుజరాత్‌లోని
Contaminated drinking water: కలుషితమైన తాగునీరు తాగి నలుగురు మృతి చెందగా.. 72 మంది ఆసుపత్రి పాలయ్యారు. పలువురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన గుజరాత్‌లోని సూరత్ పరిధిలోని కఠోర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం హుటాహుటిన రంగంలోకి దిగిన సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలవడంతో నీరు కలుషితం అయినట్లు పేర్కొంటున్నారు. ఆ నీరు తాగిన వారు నలుగురు మరణించగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారని పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఆదేశిచింది.
కఠోర్ గ్రామానికి చెందిన ప్రజలు ఆదివారం పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతతకు గురై వాంతులు.. విరేచనాలతో ఆసుసత్రుల బాట పట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నాపెద్దా అందరూ ఆసుపత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన వారు వాసవ (45), హరీశ్ రాథోడ్ (42), మోహన్ రాథోడ్ (70) విజయ్ సోలంకి (38) ఉన్నారు.
చిన్నారులు అకస్మాత్తుగా నీరసంతో కిందపడిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో పాటు ఆ గ్రామంలోని ప్రజలందరిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: