వైసీపీ నేత కంటైన‌ర్‌లో 20 ట‌న్నుల ఆవు మాంసం సీజ్

పలమనేరుకు చెందిన వైసీపీ నేత జాఫర్ అక్రమంగా పశు మాంసాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాఫర్‌కు చెందిన వాహన డ్రైవర్‌, క్లీన‌ర్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక డెయిరీకి చెందిన పాల కంటైనర్‌లో 20 టన్నుల ఆవు మాంసం త‌ర‌లిస్తుండ‌గా, ఒరిస్సా రాష్ట్రం జొజ్ పూర్ జిల్లా పరిధిలోని జనాపూర్‌లో పోలీసుల ప‌ట్టుకున్నారు. జాఫర్ మాంసం తరలిస్తున్నాడనే సమాచారంతో అక్కడి హిందూసమాజ్ సభ్యులు కాపుగాసి కంటైనర్‌ను ప‌ట్టించారు. ప‌ట్టుబ‌డిన కంటైన‌ర్ నెంబర్ AP03 TA 5655 […]

వైసీపీ నేత కంటైన‌ర్‌లో 20 ట‌న్నుల ఆవు మాంసం సీజ్
Follow us

|

Updated on: Aug 17, 2020 | 2:01 PM

పలమనేరుకు చెందిన వైసీపీ నేత జాఫర్ అక్రమంగా పశు మాంసాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాఫర్‌కు చెందిన వాహన డ్రైవర్‌, క్లీన‌ర్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక డెయిరీకి చెందిన పాల కంటైనర్‌లో 20 టన్నుల ఆవు మాంసం త‌ర‌లిస్తుండ‌గా, ఒరిస్సా రాష్ట్రం జొజ్ పూర్ జిల్లా పరిధిలోని జనాపూర్‌లో పోలీసుల ప‌ట్టుకున్నారు. జాఫర్ మాంసం తరలిస్తున్నాడనే సమాచారంతో అక్కడి హిందూసమాజ్ సభ్యులు కాపుగాసి కంటైనర్‌ను ప‌ట్టించారు. ప‌ట్టుబ‌డిన కంటైన‌ర్ నెంబర్ AP03 TA 5655 కూడా రవాణా శాఖ రికార్డుల ప్రకారం జాఫర్ పేరు మీదే ఉంది. పాల వాహనాలను పోలీసులు తనిఖీ చేయరని ఉద్దేశంతో కొంతకాలంగా అవే కంటైనర్లల్లో ఆవు మాంసం తరలిస్తున్నామని డ్రైవర్, క్లినర్ చెబుతున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని పోలీసులు పూడ్చిపెట్టారు.

Also Read :

కరోనా కొత్త జన్యువు గుర్తించిన మలేసియా : పది రేట్లు వేగంగా వైరస్‌ వ్యాప్తి

పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్