ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం.. 20 మందికి పాజిటివ్..

ఇండియన్ నేవీలో కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత యుద్ద నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న నావికాదళం సిబ్బంది 20మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ముంబై నగరంలోని కొలాబాలోని

ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం.. 20 మందికి పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 1:03 PM

ఇండియన్ నేవీలో కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత యుద్ద నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న నావికాదళం సిబ్బంది 20మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ముంబై నగరంలోని కొలాబాలోని ఇండియన్ నేవీకి చెందిన అశ్వినీ ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నావికాదళం సిబ్బందికి కరోనా సోకిన ఘటనతో తాము యుద్ద నౌకలు, జలాంతర్గాముల్లో వైరస్ లేకుండా శానిటైజ్ చేయించామని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ చెప్పారు.

కాగా.. కోవిద్-19 దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీంతో భారత నావికాదళంలో అనవసరమైన శిక్షణ, సమావేశాలు, ప్రయాణాలను రద్దు చేశామని నేవీ అధికారులు చెప్పారు.నావికాదళం సిబ్బంది ఉన్న చోట నుంచి పనిచేయడం, ఎక్కువమంది గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. కాగా గతంలో భారత సైన్యంలో పనిచేస్తున్న 8మందికి కరోనా వైరస్ సోకిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నారావణే తెలిపారు. కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చిన సైనిక సిబ్బందిని ప్రత్యేక రైళ్లలో బెంగళూరు నుంచి జమ్మూ, గౌహతీలకు పంపించామని ఆర్మీ చీఫ్ స్పష్టంచేశారు.