AP Politics: రామచంద్రపురం వైసీపీ సీటు ఎవరికి..? సీఎం జగన్ దగ్గరకు చేరిన పిల్లి సుభాష్ – మంత్రి చెల్లబోయిన పంచాయితీ..!
మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ జరుగుతున్న గొడవ ఇపుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరింది. సోమవారం సాయంత్రం సజ్జలు రామ కృష్ణ రెడ్డిని ఇంటి దగ్గర కలిసిన పిల్లి సుభాష్ చంద్రబోస్..మళ్లీ మార్నింగ్ విజయవాడ వచ్చారు.

మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ జరుగుతున్న గొడవ ఇపుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరింది. సోమవారం సాయంత్రం సజ్జలు రామ కృష్ణ రెడ్డిని ఇంటి దగ్గర కలిసిన పిల్లి సుభాష్ చంద్రబోస్..మళ్లీ మార్నింగ్ విజయవాడ వచ్చారు. అక్కడే వున్న ఎంపీ మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల రీజినల్ ఇంఛార్జి కావటం తో ఆయనను కూడా కలిశారు. మధ్యాహ్నం బోస్ సీఎం జగన్‌ను కలిశారు. పిల్లి లేవనెత్తిన అంశాలపై దృష్టి పెట్టాలని ఎంపీ మిథున్ రెడీకి చేపిన సీఎం జగన్.. పార్టీలో వర్గాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రామచంద్రపురం సీట్ విజయంలో ఇద్దరు సీనియర్ల మధ్య వివాదం నెలకొనడం గోదావరి జిల్లాల వైసీపీ వర్గాల్లో కాకరేపుతోంది.
ఇంతకీ వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందన్న అంశంపై గోదావరి జిల్లాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిద్దరి మధ్య వివాదం లోకల్ – నాన్ లోకల్ గొడవలా కొంతమంది చూస్తుంటే.. మరికొందరు తమ వారసుల భవిష్యత్తును భద్రం చేసేందుకు వారి మధ్య గొడవ నడుస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. తనను కలిసి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు సీఎం జగన్ ఏం హామీ ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా కావటంతో చెల్లుబోయిన వేణుగోపాల్‌కే ఇవ్వాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారని.. అక్కడ వర్క్ కూడా చేసుకోమని జగన్ ఆల్ట్రెడీ వేణుకు చెప్పినట్లు ఆయన సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారని వేణు వర్గం అంటోంది. అయితే ఆయన నాన్ లోకల్ కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం అంటుంది.
ఇదే కాకుండా మంత్రి వేణు గోపాల్.. పిల్లి అనుచరులపై అక్రమంగా కేసులు పెటి వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే మంత్రి వేణు మాత్రం రామచంద్రపురం నియోజకవర్గంలో పిల్లివర్గానికి చెందిన వారిపై కేసులు పెట్టించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. తప్పు చేస్తే కేసులనేవి సాధారణంగా ఉంటాయని.. ఈ కేసుల వెనుక తన ప్రమేయమున్నట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బోస్ తనయుడికి టికెట్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అని వేణు అంటున్నారు. అంతటితో ఆగకుండా పిల్లి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు.




సీఎం జగన్‌కి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో రామచంద్ర పురం సీట్ పిల్లి తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ కు ఇస్తారా అంటే డౌటే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మంత్రి వేణుకే రామచంద్రాపురం సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైసీపీ వర్గాలు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే..
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..
