ఏపీలో ‘పది’ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి…
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా స్పందించారు. ఏపీలో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణలో పదోవ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఏపీలో కూడా పది పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా స్పందించారు. ఏపీలో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో పరీక్షలు రద్దు చేసినా.. ఏపీలో మాత్రం నిర్వహిస్తామని.. రాష్ట్రంలో జూలై 10 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. వీటి కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని.. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. విద్యార్ధులను ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేశారు.
Also Read:
జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..
అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..
జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!




