ఏపీలో కొత్తగా 218 పాజిటివ్ కేసులు..మరణాలు 78
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు, రోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు, రోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 136 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 26 మందికి, విదేశాల నుంచి వచ్చిన 56 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5,247కి చేరినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా కేసులు కలిపితే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,126కు చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 2,475 మంది కరోనా నుండి కోలుకున్నారని.. 1,573 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. అటు మరణాల సంఖ్య 78కి చేరినట్లు వివరించింది. గడిచిన 24గంటల్లో 72 మంది కరోనా నుంచి కోలుకున్నారని..ఒకరు మరణించినట్లు పేర్కొంది.




