జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..

ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చునని సీఎం తెలిపారు.

జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..
Follow us

|

Updated on: Jun 10, 2020 | 11:03 AM

ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చునని సీఎం తెలిపారు. చిన్న నదుల నుంచి ఎడ్ల బండ్లపై సొంత అవసరాలకు గ్రామాల్లో ఉన్నవారు పక్కనే ఉన్న రీచ్‌ల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చునని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అనుమతులను గ్రామ సచివాలయాల్లో తీసుకోవచ్చునని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధ పధకాలపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇకపై బల్క్ ఆర్డర్స్‌కు అనుమతులను జేసీలకు అప్పగించాలని తెలిపారు. దీనికి సంబంధించిన ఎస్‌ఓపీ రేపటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచ్‌లనూ ఓపెన్ చేయాలన్నారు. అదేవిధంగా ఇసుక రీచ్‌ల దగ్గర ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలన్నారు. కాగా, వర్షాకాలం వస్తుండటంతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలన్నారు.

Also Read: 

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!