అబ్బా.. లాక్ డౌన్ అందుక్కూడా ఉపయోగపడుతుందా? సూపర్ కదా!

లాక్ డౌన్ పీరియడ్ జనానికి లెక్కలేనన్న సమస్యలను తెచ్చిపెడుతోంది. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితితో అందరూ సతమతమవుతున్నారు. అయితే, ఈ లాక్ డౌప్ ప్రభుత్వానికి మరో రకంగా ఉపయోగపడుతోంది.

  • Rajesh Sharma
  • Publish Date - 1:37 pm, Sat, 18 April 20
అబ్బా.. లాక్ డౌన్ అందుక్కూడా ఉపయోగపడుతుందా? సూపర్ కదా!

లాక్ డౌన్ పీరియడ్ జనానికి లెక్కలేనన్న సమస్యలను తెచ్చిపెడుతోంది. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితితో అందరూ సతమతమవుతున్నారు. అయితే, ఈ లాక్ డౌప్ ప్రభుత్వానికి మరో రకంగా ఉపయోగపడుతోంది. లాక్ డౌన్ ఆసరాగా తెలంగాణ ప్రభుత్వం తానెంచుకున్న దారిలో ఓ పనిని చక్కబరచుకుంటోంది. ఇంతకీ ఆ పని ఏంటనే కదా ? రీడ్ దిస్..

నిత్యం ట్రాఫిక్‌ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా చోట్ల రోడ్ల రిపేర్లు, బ్రిడ్జీల నిర్మాణాలు అంత వేగంగా జరగడం లేదు. చాలా చోట్ల నిర్మాణ పనులు సంవత్సరాల తరబడి నిలిచిపోయిన పరిస్థితి కనిపించేది. అయితే లాక్ డౌన్ కారణంగా నగరంలో జనసమ్మర్థం తగ్గిపోయింది. చాలా రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని నగరంలో ఏళ్ళ తరబడి పూర్తి కానీ బ్రిడ్జీలను పూర్తి చేయాలని సంకల్పించింది తెలంగాణ రోడ్లు భవనాల శాఖ.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొని వుండేది. అయితే తాజాగా లాక్ డౌన్ పీరియడ్ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో పనులు వేగవంతమయ్యాయి. తాజాగా శనివారం ఈ బ్రిడ్జి పనులను పరిశీలించారు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు ఇతర అధికారులు.

లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పరు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మొదట్లో భూసేకరణ పనుల కారణంగా ఇబ్బంది ఉండేదని, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కృషితో ఆ సమస్య పరిష్కారమైందని, జూన్ నెలాఖరు వరకు ఒక లైన్ అందుబాటులోకి తీసుకొచ్చి, జులై నెలాఖరు వరకు మొత్తం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. అందరి సమిష్టి కృషితో పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఇదే విధంగా నగరంలోని చాలా రోడ్ల రిపేర్ వర్క్స్‌ని కూడా వేగవంతం చేశామని, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లోను రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆర్ అండ్ బీ శాఖ అధికారులు చెబుతున్నారు.