పోలవరంపై జగన్‌కు నివేదిక.. రివర్స్ టెండర్ల పై చర్చ..

పోలవరం ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించనుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టుల విషయంలో అక్రమాలు జరిగాయని.. వాటిని పరిశీలించేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. దీంతో పోలవరం పై పూర్తిగా అధ్యయనం చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లలోనే అక్రమాలు జరిగినట్లుగా తేల్చింది. అలాగే ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలక అంశాలను నిపుణుల కమిటీ రాబట్టింది. 2013లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు సంబంధించి […]

పోలవరంపై జగన్‌కు నివేదిక.. రివర్స్ టెండర్ల పై చర్చ..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:24 PM

పోలవరం ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించనుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టుల విషయంలో అక్రమాలు జరిగాయని.. వాటిని పరిశీలించేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. దీంతో పోలవరం పై పూర్తిగా అధ్యయనం చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లలోనే అక్రమాలు జరిగినట్లుగా తేల్చింది. అలాగే ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలక అంశాలను నిపుణుల కమిటీ రాబట్టింది.

2013లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు సంబంధించి టెండర్లు మొదలుకుని ఎన్నికల ముందు వరకూ వివిధ దశల్లో జరిగిన రికార్డులను నిపుణుల కమిటీ పరిశీలించింది. 2010లో ప్రాజెక్ట్ వ్యయం రూ.16 వేల కోట్లు ఉండగా.. 2018 నాటికి రూ.55వేల 78 కోట్లకు పెరగడం పై కమిటీ ఆరా తీసింది. ప్రాజెక్టు పనుల్లో ప్రస్తుత ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం రద్దయితే సబ్ కాంట్రాక్టర్‌లకు అవకాశం ఉండదని కమిటీ భావిస్తోంది. అందువల్ల కొత్త టెండర్లు పిలవడం పై నిపుణుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాజెక్టు పనులకు సంబంధించి నిపుణుల కమిటీ సేకరించిన పూర్తి నివేదికలను.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు ఇవ్వనుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, పనులపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..