AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరి జలాలు సగం..సగం !

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలు క్రమేపీ పరిష్కారమవుతున్నాయి. ఉభయ రాష్ట్రాల సీఎం లు కేసీఆర్. జగన్ ఇద్దరూ ఇటీవల జరిపిన సమావేశంలో.. కృష్ణా, గోదావరి జలాలను సమానంగా పంచుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. హైదరాబాద్ లో మంగళవారం సమావేశమైన ఈ రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లతో కూడిన హై లెవెల్ కమిటీ..మొదట కృష్ణా రివర్ బేసిన్ కి గోదావరి జలాల డైవర్షన్ పై […]

గోదావరి జలాలు సగం..సగం !
Anil kumar poka
| Edited By: |

Updated on: Jul 10, 2019 | 4:12 PM

Share

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలు క్రమేపీ పరిష్కారమవుతున్నాయి. ఉభయ రాష్ట్రాల సీఎం లు కేసీఆర్. జగన్ ఇద్దరూ ఇటీవల జరిపిన సమావేశంలో.. కృష్ణా, గోదావరి జలాలను సమానంగా పంచుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. హైదరాబాద్ లో మంగళవారం సమావేశమైన ఈ రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లతో కూడిన హై లెవెల్ కమిటీ..మొదట కృష్ణా రివర్ బేసిన్ కి గోదావరి జలాల డైవర్షన్ పై చర్చించింది. అనంతరం ఇలా మళ్లించిన జలాలను ఉభయ రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇంజనీర్లు మురళీధర రావు, వెంకటేశ్వరరావు, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ నరసింహారావు, తెలంగాణ ఇరిగేషన్ విభాగం ఆఫీసర్ ఆన్ డ్యూటీ శ్రీధర్ దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన ఈ కమిటీని ఈ మధ్యే రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఏర్పాటు చేశాయి.

గోదావరి నుంచి వెయ్యి టీఎంసి ల నీరు లభ్యమవుతుందని, తెలంగాణకు ఇరిగేషన్, పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 700 నుంచి 800 టీఎంసీల జలాలు కావాల్సి ఉంటుందని తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర రావు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 1300 టీఎంసీ ల నీరు అవసరమవుతుందని అంచనా అన్నారు. కాగా-నీటి డైవర్షన్ పైన, దీన్ని మళ్లించే మార్గంపైనా చర్చించేందుకు తిరిగి సమావేశం కావాలని ఈ కమిటీ నిర్ణయించింది. గోదావరితో ప్రాణహిత, ఇంద్రావతి నదుల అనుసంధానంపై చర్చించామని, ఏపీ ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రెండు నదులూ దుమ్మగూడెం వద్ద గోదావరిలో కలిసినప్పుడు వెయ్యి టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..