సుప్రీంకు చేరిన కర్ణాటక ‘లొల్లి’

కర్ణాటక రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆమోదించకపోవడంతో.. కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం విచారిస్తామని తెలిపారు. అయితే కర్ణాటకకు చెందిన 14మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు […]

సుప్రీంకు చేరిన కర్ణాటక ‘లొల్లి’
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2019 | 12:36 PM

కర్ణాటక రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆమోదించకపోవడంతో.. కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం విచారిస్తామని తెలిపారు.

అయితే కర్ణాటకకు చెందిన 14మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలు సమర్పించగా.. వాటిలో ఐదు మాత్రమే ఫార్మట్ ప్రకారం ఉన్నాయని స్పీకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాజ్యాంగ విధులను స్పీకర్ సక్రమంగా నిర్వహించడం లేదని వారు విమర్శిస్తున్నారు.