ఏపీలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులు ఇద్దరికి శాఖలను ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు

ఏపీలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 22, 2020 | 9:50 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులు ఇద్దరికి శాఖలను ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్‌ నారాయణకు కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. శంకర్‌ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు.