తెలంగాణలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం రాష్ట్రంలో 1,554 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 49,259 మందికి కరోనా బారినపడ్డారు.

తెలంగాణలో 50 వేలకు చేరువలో కరోనా కేసులు
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 22, 2020 | 10:04 PM

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం రాష్ట్రంలో 1,554 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 49,259 మందికి కరోనా బారినపడ్డారు. కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ తొమ్మిది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 438కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 842 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇవాళ 1,281 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 37,666 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,155మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం 15,882 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారిగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 132 కేసులు, మేడ్చల్ జిల్లాలో 96 కేసులు , కరీంనగర్ జిల్లాలో 73, నల్గొండ జిల్లాలో 51,నిజమాబాద్ జిల్లాలో 28వరంగల్ అర్బన్ జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 24, మెదక్ జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి.