400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర పోలీసులు..! సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం..

Andhra police : ఆంధ్రప్రదేశ్ పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల 400 మంది కొవిడ్ బాధితులకు ఊపిరిపోసినట్లయింది.

400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర పోలీసులు..! సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం..
Andhra Police
Follow us

|

Updated on: May 07, 2021 | 6:45 PM

Andhra police : ఆంధ్రప్రదేశ్ పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల 400 మంది కొవిడ్ బాధితులకు ఊపిరిపోసినట్లయింది. విజయవాడ GGHలో ఆక్సిజన్ తో సుమారు 400 వందల మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే ఆక్సిజన్ నిల్వలు దగ్గర పడటంతో అధికారులు ఒరిస్సా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే 18 టన్నులతో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి.

దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుంచి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు. అయితే ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ ని పోలీసులు గుర్తించారు. వెంటనే ట్రక్ డ్రైవర్‌ని నిలదీయగా నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని ఇక్కడ నిలిపి వేసినట్టుగా వివరించాడు

డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రత్తిపాడు సీఐ అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశాడు.డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చాడు. దీంతో ఏపీ డీజీపీ పలువురు పోలీసులను అభినందించారు. మరోసారి ప్రజాసేవలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

భోజనం చేశాక ఈ పనులు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయట.. అధ్యయనాల్లో తేలిన షాకింగ్ విషయాలు..

Breaking News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

TS Covid Vaccine: తెలంగాణలో మొదటి డోసు కరోనా టీకా నిలిపివేత.. రేపటి నుంచి వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలని సర్కార్ నిర్ణయం