Nitish Kumar Reddy: ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా

ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీతో అదరగొట్టిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. 8వ స్థానంలో బరిలోకి దిగిన అతను తన అద్భుత సెంచరీతో మెరవడమే కాకుండా భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.

Nitish Kumar Reddy: ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
Nitish Kumar Reddy
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2024 | 5:05 PM

ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్‌లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెంచరీ కొట్టిన వెంటనే సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఈ కుర్ర క్రికెటర్ కు అభినందనలు తెలిపారు. ఇక మెల్ బోర్న్ స్టేడియంలోని క్రికెట్ అభిమానులైతే హర్ష ధ్వానాలతో మోత మోగించారు. ఇక స్వదేశంలోనూ నితీశ్ రెడ్డికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ యంగ్ క్రికెటర్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా నితీశ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.

అదే సమయంలో ఈ వైజాగ్ కుర్రోడికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నినితీశ్ రెడ్డికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఇక శాప్ ఛైర్మన్ ర‌వినాయుడు కూడా నితీశ్ కుమార్ రెడ్డి ప్రద‌ర్శన ను కొనియాడారు. ప్రతికూల ప‌రిస్థితుల్లోనూ నితీశ్ కుమార్ అత్యుత్తమంగా రాణించారని కితాబిచ్చారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో నితీశ్ సెంచ‌రీ చేయడం ఏపీకి గ‌ర్వకార‌ణమని ర‌వినాయుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

చంద్ర బాబు ట్వీట్..

h3>నితీశ్ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం.. వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!