AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 121 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,933 కరోనా టెస్టులు నిర్వహించగా.. 121 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య....

  • Ram Naramaneni
  • Publish Date - 7:11 pm, Mon, 11 January 21
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 121 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
AP-Corona

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,933 కరోనా టెస్టులు నిర్వహించగా.. 121 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,82,142కి చేరింది. కరోనా మహమ్మారి సోకి కొత్తగా ఒకరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 7,130కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం బులిటెన్‌లో వివరించింది. తాజాగా 289 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,72,561కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,450 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,55,607 శాంపిల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.