AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ, త్రివిక్రమ్‌ల మాయ… ‘అల’కు విజిల్ ఒక్కటే సరిపోదు గురూ..!

సంక్రాంతి విడుదల కానున్న సినిమాల్లో ఒకటైన ‘అల వైకుంఠపురములో’కి భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ  యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిత్ర యూనిట్ బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి డాడీ(మురళీ శర్మ) అతి ప్రేమ, జాగ్రత్తలతో విసిగిపోయిన అల్లు అర్జున్.. అనుకోని విధంగా […]

బన్నీ, త్రివిక్రమ్‌ల మాయ... 'అల'కు విజిల్ ఒక్కటే సరిపోదు గురూ..!
Ravi Kiran
|

Updated on: Jan 07, 2020 | 5:32 PM

Share

సంక్రాంతి విడుదల కానున్న సినిమాల్లో ఒకటైన ‘అల వైకుంఠపురములో’కి భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ  యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిత్ర యూనిట్ బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినిమా ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి డాడీ(మురళీ శర్మ) అతి ప్రేమ, జాగ్రత్తలతో విసిగిపోయిన అల్లు అర్జున్.. అనుకోని విధంగా ‘వైకుంఠపురము’లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ సీనియర్ నటుడు జయరామ్ కూతురు పూజా హెగ్డే‌తో ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే వాళ్ళ ఇంటికి సముద్రఖని రూపంలో ఆపద అనుకోని అతిథిలా వస్తుంది. దాన్ని బన్నీ ఎలా ఎదుర్కున్నాడు. అసలు జయరామ్ ఫ్యామిలీ‌కి, బన్నీకి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే వెండి తెరపై చూడాల్సిందే.

‘నిజం చెప్పినప్పుడే భయం వేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తోంది’.  ‘దేనినైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది. ఒకటి నేలకి.. రెండు వాళ్ళకి’ అని పూజా హెగ్డేను ఉద్దేశించి చెప్పిన డైలాగు.. జయరామ్ చెప్పే ‘గొప్ప యుద్దాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే’ డైలాగులు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్, వైకుంఠపురములో టైటిల్ సాంగ్ అద్భుతంగా ఉన్నాయి. గురూజీ మార్క్ పంచ్ డైలాగులు, కామెడీ ట్రైలర్‌లో కావాల్సినంత ఉంది.

పూజా హెగ్డే, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, టబు, సచిన్ కడేకర్, సునీల్, రోహిణి, సముద్రఖని, నివేదా పేతురాజ్, నవదీప్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా, జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us