అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

ఇంజనీరింగ్, ఇత‌ర‌ సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిష‌న్ పొంది... వివిధ కారణాలతో ప్ర‌వేశాన్ని క్యాన్సిల్ చేసుకునే స్టూడెంట్స్‌కు ఫీజులు, సర్టిఫికెట్లను వారంలోపు తిరిగి ఇచ్చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ఉత్తర్వులు వెలువ‌రించింది.

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే
Ram Naramaneni

|

Sep 05, 2020 | 9:51 AM

ఇంజనీరింగ్, ఇత‌ర‌ సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిష‌న్ పొంది… వివిధ కారణాలతో ప్ర‌వేశాన్ని క్యాన్సిల్ చేసుకునే స్టూడెంట్స్‌కు ఫీజులు, సర్టిఫికెట్లను వారంలోపు తిరిగి ఇచ్చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ఉత్తర్వులు వెలువ‌రించింది. తమ అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేసుకునే స్టూడెంట్స్‌తో పాటు మధ్యలో ఉపసంహరించుకునే స్టూడెంట్స్‌కు కూడా ఫీజులు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని అన్ని సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌–19తో తలెత్తిన ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల నేపథ్యంలో ఇది ప్రతి విద్యా సంస్థ ప్రాథమిక బాధ్యతగా గుర్తుంచుకోవాల‌ని పేర్కొంది. పూర్తి ఫీజు వాపసుతో టెక్నిక‌ల్ కోర్సుల సీట్ల అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేసుకోవడానికి గడువు నవంబర్‌ 10గా ఏఐసీటీఈ గ‌తంలో అనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని అంశాలను జోడిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

  • నవంబర్‌ 10 కంటే ముందుగా స్టూడెంట్ తన ప్ర‌వేశాన్ని ఉపసంహరించుకుంటే వసూలు చేసిన మొత్తం ఫీజులో రూ.1,000 లోపు ప్రాసెసింగ్ ఛార్జెస్ క్రింద‌ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని కాలేజీలు తిరిగి చెల్లించాలి.
  • ఒకవేళ నవంబర్‌ 10 తర్వాత స్టూడెంట్ అడ్మిషన్‌ను వదిలేస్తే.. ఖాళీ అయ్యే ఆ సీటును నవంబర్‌ 15లోగా వేరే స్టూడెంట్‌తో ఫిల్ చేసుకుంటే రూ.1,000కి మించకుండా ప్రాసెసింగ్ ఛార్జ‌స్ తీసుకోవచ్చు. దీంతోపాటు స్టూడెంట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ మేర‌క‌కు హాస్ట‌ల్ ఉంటే హాస్ట‌ల్ ఫీజు, ట్యూష‌న్ ఫీజు తీసుకుని మిగిలిన డ‌బ్బును వెన‌క్కి ఇచ్చేయాలి.
  • నవంబర్‌ 10 తర్వాత ఖాళీగా అయిన‌ సీటు నవంబర్‌ 15 వరకు ఫిల్ అవ్వ‌క‌పోతే స‌ద‌రు కాలేజీ విద్యార్థికి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలి. సర్టిఫికెట్లు కూడా వెనక్కి ఇచ్చేయాలి.
  • స్టూడెంట్ అడ్మిషన్‌ను వదులుకుని విద్యా సంస్థ‌ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తదుపరి సెమిస్టర్లు, సంవత్సరాలకు సంబంధించిన ఫీజును అడగకూడ‌దు.
  • అడ్మిష‌న్ క్యాన్సిల్ చేయడం లేదా ఫీజును వాపసు చేయడంలో ఆలస్యం, ఏఐసీటీఈ మార్గదర్శకాలను పాటించకున్నా చర్యలు తప్పవు.

Also Read :

 ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu