AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిర్యాణి అడవుల్లో డీజీపీ ఆకస్మిక పర్యటన

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మూడు రోజులుగా రాష్ట్ర సరిహద్దులో మకాం వేసిన డీజీపీ, తిర్యాణి అడవుల్లో పర్యటించి, పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తిర్యాణి అడవుల్లో డీజీపీ ఆకస్మిక పర్యటన
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 05, 2020 | 10:02 AM

Share

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. గ్రేహౌండ్స్ బృందాలు అడవులను జల్లెడపడుతున్నాయి. మూడు రోజులుగా రాష్ట్ర సరిహద్దులో మకాం వేసిన డీజీపీ తిర్యాణి అడవుల్లో పర్యటించి, పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరోవైపు ఆదివాసీ శంకర్ ది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ రేపు చర్ల, శబరి ప్రాంతాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు.

రాష్ట్ర సరిహద్దులో మకాం వేసిన డీజీపీ మహేందర్‌ రెడ్డి పర్యటన వరుసగా నాలుగో రోజు కొనసాగుతోంది. మూరుమూల ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా పోలీస్‌ స్టేషన్లను తిరుగుతూ.. పోలీసుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. రాత్రి 11 గంటలకు ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో పర్యటించి, అరగంటపాటు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. డీజీపీ పలు ఫైళ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న ఏర్పాట్లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గత మూడు రోజులుగా ఆసిఫాబాద్‌ జిల్లాలో మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. మావోయిస్టుల సంచారంతో జిల్లాలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్ టీమ్స్ అడవులను జల్లెడ పడుతున్నాయి.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు నాలుగో రోజు కొనసాగుతోంది. శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డి మారుమూల ప్రాంతం తిర్యాణిలో పర్యటించారు. మావోయిస్టుల సంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు.

మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్‌లోనే డీజీపీ మహేందర్‌రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్‌లో డీజీపీ మహేందర్‌ రెడ్డి రెండోసారి పర్యటించారు.

తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది.

మరోవైపు కూంబింగ్ ఆపరేషన్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్‌ ఏఆర్‌ సివిల్‌ పోలీసులు కోవిడ్‌ బారిన పడినట్టు సమాచారం.

Follow Us
ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. ఏఐకి పని నేర్పండి.. పైసలు పొందండి
ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. ఏఐకి పని నేర్పండి.. పైసలు పొందండి
రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.3 లక్షలు మీకే..
రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.3 లక్షలు మీకే..
దేశవాళీ క్రికెట్‌కు కౌంట్‌డౌన్.. దులీప్ ట్రోఫీ కెప్టెన్ల ప్రకటన
దేశవాళీ క్రికెట్‌కు కౌంట్‌డౌన్.. దులీప్ ట్రోఫీ కెప్టెన్ల ప్రకటన
రామాయణంలో సీత పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్..
రామాయణంలో సీత పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్..
మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు
మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు
ఈ టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? చేసిన సినిమాలన్నీ హిట్టే
ఈ టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? చేసిన సినిమాలన్నీ హిట్టే
సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు
సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు
వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.. ఎందుకంటే..
వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.. ఎందుకంటే..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? 24 నుంచి 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? 24 నుంచి 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు..
ఫైనల్లో ఓడినా హీరోనే.. భారత్‌కు సిల్వర్ అందించిన మణిపూర్ కుర్రాడు
ఫైనల్లో ఓడినా హీరోనే.. భారత్‌కు సిల్వర్ అందించిన మణిపూర్ కుర్రాడు